హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తుపదార్థాల కట్టడికి 'హంటర్' జాగిలం

బాపట్ల జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల రవాణాను అరికట్టేందుకు 11నెలల ప్రత్యేక శిక్షణ పొందిన 'హంటర్' అనే బెల్జియన్ మాలినోయిస్ జాతి జాగిలాన్ని పోలీస్ శాఖలో ప్రవేశపెట్టినట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. వాహనాల తనిఖీలు, కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లలో దీని సేవలు వాడుతామన్నారు. 'ఆపరేషన్ త్రిశూల్' ద్వారా బాపట్లను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని చెప్పారు.