హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ పచ్చి అరటి తింటే?

పచ్చి అరటిపండ్లలో ఫైబర్, రెసిస్టెంట్‌ స్టార్చ్‌ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చు. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువు నిర్వహణకు తోడ్పడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా పచ్చి అరటిపండ్లు ఉపయోగకరంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.