హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆ' మూడు మండలాలను కరువు జాబితాలో చేర్చాలి'

KRNL: గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు రూరల్ మండలాలను కరువు జాబితాలో చేర్చాలని వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాభావంతో రైతులు పంటలు, పెట్టుబడులు నష్టపోయారని తెలిపారు. పంట నష్టపరిహారం, బీమా పరిహారం వెంటనే అందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.