హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద విద్యార్థులకు 30 సైకిళ్ళు పంపిణీ

PLD: నరసరావుపేటలో పి4 కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు 30సైకిళ్లను పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.