KRNL: సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయనున్న శనగ, వేరుశనగ విత్తనాల నాణ్యతలో రాజీ ఉండకూడదని జేడీఏ పి.ఎల్. వరలక్ష్మి సూచించారు. శనగ విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లు, వేరుశనగ విత్తనాల కోల్డ్ స్టోరేజీలను శనివారం తనిఖీ చేసి, ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విత్తనాల నాణ్యతపై తనిఖీలు


