హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 5న కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ వికాస ఆధ్వర్యంలో ఈ నెల 5న కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నుంచి బీటెక్‌ వరకు అర్హత కలిగిన 35 ఏళ్లలోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులతో హాజరుకావాలని సూచించారు.