CTR: పుంగనూరు పట్టణం మంగమ్మ కట్టపై ఉన్న బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు, చుట్టూ గోడలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 25 ఏళ్ల క్రితం నిర్మించిన షెల్టర్ ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి కొత్త బస్ షెల్టర్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా బస్ షెల్టర్.. చర్యలేవీ?


