హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె విరమణ

ASR: పాడేరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెను శనివారం విరమించారు. పంచాయతీ ఈవో రమేష్, సీఐటీయూ నేతలతో జరిపిన చర్చల్లో పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం, పనిభారం తగ్గించేందుకు సిబ్బందిని పెంచడం, కనీసం రూ.12వేల వేతనం, ప్రతినెల 16న జీతం చెల్లింపుపై రాతపూర్వక ఒప్పందం కుదిరింది. దీంతో డీపీవో చంద్రశేఖర్ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు.