హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

TPT: చంద్రగిరి మండలం గాదెంకి టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.