హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన రైతు బజార్ పనులను పరిశీలించిన జేసీ

KKD: నూతన రైతు బజార్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్, రాజీవ్ గృహకల్ప వద్ద నూతనంగా నిర్మిస్తున్న రైతు బజార్‌ను శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్‌లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.