హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల దత్తతపై ఉత్తర్వులు అందజేత

KNR: శిశుగృహం ద్వారా దత్తత పొందిన ముగ్గురు పిల్లల దత్తత ఉత్తర్వులను కలెక్టర్‌ చిత్ర మిశ్ర శనివారం బెంగళూరు, తమిళనాడు, గోదావరిఖనికి చెందిన ముగ్గురు దంపతులకు అందజేశారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన విధానంలోనే దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. దత్తతపై పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.