హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు పశ్చిమలో అభివృద్ధి పనులకు శ్రీకారం

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రూ.8.50 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ పరిధిలోని 21, 25, 43, 45, 49 డివిజన్లలో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, అవుట్‌ఫాల్ డ్రెయిన్ల నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.