WGL: కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. పర్వతగిరి మండలంలోని 33 గ్రామాలకు చెందిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులను నేడు ఎమ్మెల్యే సన్మానించారు. నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించారు.
తెలంగాణ
కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: MLA


