హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్‌కు సన్మానం

ATP: కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదంలో పడిన ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన అనంతపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ సి.సురేంద్రను జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించి సన్మానించారు. గత నెల 29న రైల్వే స్టేషన్‌లో వేలాడుతున్న రవికుమార్ అనే వ్యక్తిని సురేంద్ర సమయస్ఫూర్తితో ప్లాట్‌ఫామ్‌పైకి లాగారు. సురేంద్ర చూపిన చొరవ పోలీసు శాఖకు గర్వకారణమని ఎస్పీ కొనియాడారు.