హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలి'

ASR: కొయ్యూరు మండలం కంఠారం నుంచి చోద్యం వరకు రహదారి మరమ్మతు పనులు, అలాగే కంఠారంలో మిగిలిన వీధి సీసీ రోడ్ల పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని జనసేన మండల నేతలు కోరారు. ఈ మేరకు శనివారం పాడేరులో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ ఛైర్మన్ డా.గంగులయ్యను కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను గంగులయ్య దృష్టికి తీసుకెళ్లారు.