హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ అమలు చేయాలని వినతి

MNCL: చెన్నూరు మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బోడంకి చందు మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో పనులు లభించక ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు.