హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీడీసీసీ బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్లతో సమీక్ష

GNTR: గుంటూరులో జీడీసీసీ బ్యాంకు 44 బ్రాంచ్‌ల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు, సీఈఓ వీవీఎస్‌ ఫణికుమార్‌, అధికారులు పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలకు రుణాలను త్వరగా అందించాలని చైర్మన్‌ సూచించారు. మొండి బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలని సీఈఓ తెలిపారు. డిపాజిట్లు పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.