హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

193 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు

ప్రకాశం: అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. శనివారం ఒంగోలు క్యాంపు కార్యాలయంలో 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేశారు. ఒంగోలు నగర పరిధిలో 153 మందికి రూ.2.50 లక్షల చొప్పున, కొత్తపట్నం మండలంలో 40 మందికి రూ.2.89 లక్షల చొప్పున గృహ నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు.