2026 ఆసియా క్రీడల్లో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణం సాధించిన కుంకుమ్ అనిల్ మోహోద్‌ను ప్రధాని మోదీ అభినందించారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పసిడి పతకం అని కొనియాడారు. నిర్ణయాత్మక షూట్-ఆఫ్‌లో ఆమె ప్రదర్శించిన సంయమనం అద్భుతమని ప్రశంసించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడలు
కుంకుమ్‌కు స్వర్ణం.. ప్రధాని మోదీ హర్షం


