హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలంలో 32 రోడ్లకు ₹ 2.50 కోట్లు మంజూరు

NLR: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి మండలంలో 32 రోడ్ల నిర్మాణానికి ₹ 2.50 కోట్లు మంజూరైనట్లు శనివారం అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంజూరైన నిధులతో సంబంధిత రోడ్ల పనులను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు.