హైదరాబాద్: 28°C
క్రీడలు

గోల్ఫ్‌లో ప్రణవికి స్వర్ణం.. మోదీ అభినందనలు

ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం సాధించిన ప్రణవి శరత్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే అద్భుత విజయమని ఆయన కొనియాడారు. ప్రణవి అద్భుత ఆటతీరు దేశానికి మరుపురాని క్షణాలను అందించిందని పేర్కొన్నారు. ఈ విజయం యువతకు స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రణవికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.