HNK: భద్రకాళి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ ఈవో సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
దేవీ శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం


