హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

కోనసీమ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 69వ ఆవిర్భావ వేడుకలు శనివారం ముమ్మిడివరం బుద్ధ పార్కు లో ఘనంగా నిర్వహించారు. బి.శరత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి.సుధీర్, పి.వి.చక్రవర్తి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేందుకు ఆర్‌పీఐ కృషి చేసిందని వారు పేర్కొన్నారు.