హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

AKP: బలిగటం జెడ్పీ హైస్కూల్‌లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో శనివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకుడు అడిగర్ల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని ఏఎంసీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ వైద్య సేవలను వివరించారు.