హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్‌లో గ్యాస్ కష్టాలు

MDK: పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ గోదాం వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం గ్యాస్ కోసం వచ్చి గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరాలో ఆలస్యంపై అధికారులు స్పందించి, ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.