హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమాలపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు

MNCL: కాసిపేట మండలం రేగులగూడెం ఆశ్రమ పాఠశాలలో బియ్యం, నిత్యావసర సరుకుల అక్రమ తరలింపుపై AISB నాయకులు అదనపు కలెక్టర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నీ గౌడ్ మాట్లాడుతూ.. సరుకులు తరలిస్తున్న దృశ్యాలు సాక్ష్యాలతో సహా బయటపడినా చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేయాలన్నారు.