హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ నిర్లక్ష్యమే కరెంట్‌ కోతలకు కారణం: హరీష్ రావు

MDK: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఎల్ నినో కారణమని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు విమర్శించారు. బొగ్గు నిల్వలు సమకూర్చుకోవడం, విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు పరిస్థితి చేయిదాటిన తర్వాత హడావుడి చేస్తోందని విమర్శించారు.