RR: మంచాల మండలంలో మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో గ్రామానికి సుమారు రూ.3 కోట్లకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
మధ్యవర్తులు లేకుండా పథకాలు: ఎమ్మెల్యే


