హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

ADB: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ శనివారం సూచించారు. గత వారంలో 27 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. లోన్ యాప్ బెదిరింపులు, వాట్సాప్ హ్యాకింగ్, ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్, మ్యాట్రిమోనియల్, ట్రేడింగ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌‌ను సంప్రదించాలని కోరారు.