KRNL: వెల్దుర్తి తొమ్మిదవ అంగన్వాడీ కేంద్రంలో శనివారం సూపర్‌వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. తల్లులు, గ్రామ ప్రజలకు పోషకాహారం ప్రాధాన్యత, చిన్నారులకు అనుబంధ పోషకాహారం అందించే విధానంపై అవగాహన కల్పించారు. ఐసీపీఎస్ సిబ్బంది గీతావాణి, మౌనిక బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పోషణ మాసోత్సవంలో బాల్య వివాహాలపై అవగాహన


