హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: మంత్రాలయం మండలం రాంపురం గ్రామ శివారులో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన పంట పొలాలను మంత్రాలయం MLA వై.బాలనాగిరెడ్డి ఇవాళ పరిశీలించారు. పొలాల్లో పంటల పరిస్థితిని పరిశీలించి, రైతులను అడిగి పంటల సాగు, దిగుబడి, నష్టాల వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు సకాలంలో కురవక పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు.