హైదరాబాద్: 28°C
క్రీడలు

తృటిలో సెంచరీ కోల్పోయిన రోహిత్

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ 92 పరుగులు చేసి ఔటయ్యాడు. కిమో పాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి.. బౌండరీ వద్ద జ్యువెల్ ఆండ్రూకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 141 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.