హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ డీలర్‌పై కంప్లైంట్.. చర్యలు తీసుకోవాలని వినతి

కోనసీమ: రావులపాలెం ఇందిరా కాలనీలోని రేషన్ దుకాణం డీలర్ కార్డుదారుల పట్ల దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సంచార జాతుల కన్వీనర్ వీర్నాల రమణ బాబు డిప్యూటీ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. స్థానికుల సంతకాలతో సమర్పించిన ఫిర్యాదులో వినియోగదారులతో బియ్యం బస్తాలు ఎత్తిస్తున్నారని పేర్కొన్నారు. డీలర్‌పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు