హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈనెల 9న రాష్ట్రస్థాయి జానపద జాతర'

SDPT: తెలంగాణ జానపద కళలు, సంస్కృతిని పరిరక్షించే లక్ష్యంతో ఈ నెల 9న కరీంనగర్ ఫిలిం భవన్‌లో రాష్ట్రస్థాయి జానపద సాంస్కృతిక జాతర నిర్వహించనున్నట్లు హుస్నాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ తెలిపారు. కోలాటం, యక్షగానం, బతుకమ్మ తదితర కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. కళాకారులు పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.