హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి కొబ్బరికాయలు, తమలపాకులతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం ఉప ఆలయాలైన బేతాళ, రామాలయాలను కూడా దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.