హన్మకొండ జిల్లా కేంద్రంలో శనివారం ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి సర్ పై ప్రత్యేక సమావేశాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్వహించారు. రానున్న రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ పై కలిసి పోరాటాలు చేయాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
హన్మకొండలో ముగిసిన ఇండియా కూటమి సమావేశం


