ADB: గాదిగూడ మండలం మారుతి గూడ గ్రామానికి చెందిన మానసిక వికలాంగులకు సదరం సర్టిఫికెట్ లేక పెన్షన్ అందటం లేదని CPM జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు. శనివారం బాధితులను కలిసి వివరాలను వెల్లడించారు. గతంలో కలెక్టర్ స్పందించి పెన్షన్ అందజేయాలని సూచించిన బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ
పెన్షన్ అందకపోతే ఉద్యమం తప్పదు: CPM


