హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డేల్లో అరంగేట్రం చేసిన CSK బౌలర్

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేశాడు. గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ హర్యానా బౌలర్‌కు విరాట్ కోహ్లీ క్యాప్ అందజేశాడు. అన్షుల్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 116 వికెట్లు పడగొట్టగా, ఐపీఎల్‌లో ప్రస్తుతం CSK తరఫున ఆడుతున్న ఇతడు 25 మ్యాచ్‌‌ల్లో 31 వికెట్లు తీశాడు.