హైదరాబాద్: 28°C
తెలంగాణ

డా. సదాశివయ్యకు సేవా పురస్కారం

MBNR: జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయాచార్యులు డా.బీ. సదాశివయ్యకు ‘బెస్ట్ సిటిజన్ ఆఫ్ సర్వీస్ ఇన్ సొసైటీ అవార్డు’ లభించింది. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, సర్ప సంరక్షణలో చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. HYDలో కాస్మోపాలిటన్ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్, OU వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.