హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సీఐ జక్కుల శ్యాంసుందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో ఉచిత రక్త, మూత్ర, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 25 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. లైన్స్ క్లబ్ బాధ్యులు డాక్టర్ పీవీ మల్లికార్జునరావు, రఘు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన సీఐ


