హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు కోతలు.. రోడ్డుపై రాస్తారోకో..!

 KMR: కరెంటు కోతలతో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు. శాంతపూర్, మాన్యపూర్, సీతారాంపల్లి, జగన్నాథ్ పల్లి, రాజపూర్ గ్రామస్తుల రైతులు రహదారిపై రాస్తారోకో చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.