హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు ప్రమాద స్థలికి చేరుకున్న కలెక్టర్

VKB: అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించడంతో పాటు ట్రాఫిక్‌ను పునరుద్ధరించేలా అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.