హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ RC, DL కార్డుల పంపిణీ: DTO

MHBD: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పెండింగ్ RC, DL కార్డులు ఏవీ లేవని, పనిదినాల్లోనే స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికే పంపిణీ చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. కార్డులు అందని వారు సమీప పోస్టాఫీసును సంప్రదించాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.