హైదరాబాద్: 28°C
తెలంగాణ

​మద్యం కోసం ఇల్లు తగలబెట్టిన కొడుకు

MDK: మద్యం, కారు కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించిన యువకుడిని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నస్కల్‌కు చెందిన గౌతమ్‌రెడ్డి ఈ నెల 2న మద్యం మత్తులో తల్లి రజినితో గొడవపడ్డాడు. అనంతరం ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.