హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెడ్‌క్రాస్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

ములుగు జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి డా. ధర్మానాయక్ తెలిపారు. ఆదివారం ఉదయం సంక్షేమ భవన్‌లో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ట్రెజరర్, స్టేట్ ఎంసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గత నెల 26న 15 మంది సభ్యులతో జిల్లా కమిటీ ఎన్నిక జరిగిందని, సభ్యులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.