హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసార పరీక్షలతో పంట మార్పిడి: ADA

VKB: ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయంతో పాటు నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని ADA అరుణ రైతులకు సూచించారు. తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రసాయన ఎరువులతో పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాటు పంట నాణ్యత దెబ్బతింటుందన్నారు. సేంద్రియ ఎరువులు వాడుతూ, భూసార పరీక్షల ఆధారంగా పంట మార్పిడి చేపట్టాలని సూచించారు.