హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై ఆరోపణలు

NGKL: తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా, గుర్తుతెలియని వ్యక్తి ఇసుకను ఖాళీ చేసి పరారైనట్లు తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.