హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి'

NLG: అర్హులైన పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని యువజన కాంగ్రెస్ నేత వేముల గోపీనాథ్ కోరారు. గతంలో నమోదైన వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, రెండు ఫొటోలు, మొబైల్ నంబర్ సమర్పించాలని సూచించారు.