హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన

NGKL: వంగూరు మండలం చౌదర్పల్లి గ్రామంలో పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువులకు సకాలంలో వైద్యం అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. పాడి పశువుల ఆరోగ్యం మెరుగుపడితే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.