MBNR: సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంటలను కాపాడుకునేందుకు కౌకుంట్ల మండలం వెంకటగిరి రైతులు వినూత్నంగా శ్రమిస్తున్నారు. పొలాల వద్ద 10 అడుగుల గుంత తవ్వి టార్పాలిన్‌తో ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మోటార్ ద్వారా నీటిని గుంతలోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి మరో మోటార్‌తో పంటలకు నీరందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు.
తెలంగాణ
వరి పంటల రక్షణకు రైతుల ప్రయత్నం


